Please Wait...

Home Manage Booking
Main Menu

Tours By

Tour Type

Quick Links

Tours By

Quick Links

No Data Found

Customer Care

Follow Us

Telangana Tourism Srisailam Package

మేము (Bestbus) తెలంగాణ టూరిజం వారి రోజువారీ హైదరాబాద్ నుండి శ్రీశైలం బస్సు ప్యాకేజ్ కు బుకింగ్ ఫెసిలిటీ ను అందిస్తున్నాము. మా వద్ద బుక్ చేసుకున్న వారికి బస్సు బుకింగ్ తో పాటు వసతి సర్వీస్ కూడా ఉంటుంది. శ్రీశైలం ఒక ప్రసిద్ధి చెందిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఉన్న పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి  నల్లమల అడవులలో కొండగట్టుల మధ్యలో ఘాట్ రోడ్డు మార్గం లో పయనించి చేరుకుంటాము. అక్కడికి చేరుకోటానికి ఇంకొక మార్గం రోప్ వే దాన్నే పాతాళ గంగ అంటారు. శ్రీశైలం లో ఉన్న పాలధార పంచదార జలపాతాలు కూడా చూడతగిన ప్రదేశాలు. హైదరాబాద్ నుండి వచ్చి  మరి ఇలాంటి ప్రదేశాలు అన్ని చూడాలి అంటే బస్సు  టికెట్ బుకింగ్, రూమ్ బుకింగ్ లాంటి జంజాటాలు చాలా ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు అన్ని కలగకుండా సింపుల్ గా మా సైట్ లో టికెట్ బుక్ చేసుకుని ప్రశాంతమైన ప్రయాణం చేసే అవకాశం వినియోగించుకోండి. 

ఐటినేరరీ

Day 1

  • ఈ శ్రీశైలం యాత్ర బస్సు ఆపరేటర్ ప్యాసెంజర్స్ ను యాత్రి నివాస్, బేగంపేట్ మరియు బషీర్బాగ్ బోర్డింగ్ పాయింట్స్ లో ఉదయం 08:15 నుంచి 09:00 గంటల వరకు పిక్ అప్   చేసుకుంటారు.
  • అక్కడ నుండి శ్రీశైలంకు తీసుకెళ్తారు
  •  శ్రీశైలంకు సాయంత్రం సుమారు 5:00 గంటలకు చేరుకుంటారు 
  •  దారి లోనే భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు 
  •  రాత్రికి బస చేయటానికి ఒక హోటల్ లో చెక్ ఇన్ అవుతారు 

Day 2

  • ఉదయం టిఫిన్ పూర్తి చేసుకుని హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు
  • అక్కడ నుండి రోప్ వే విసిట్ అనగా పాతాళ గంగ కు చేరుకుంటారు 
  • పాలాధార, పంచదార జలపాతాలు, శిఖరం మరియు శ్రీశైలం డాం లాంటి ప్రదేశాలు చూపిస్తారు 
  • సందర్శనలు పూర్తి అవ్వగానే హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది 
  • హైదరాబాద్ చేరుకునే సరికి సమయం సాయంత్రం సుమారు 07:00 గంటలు అవుతుంది 

ఇంక్లూషన్స్

  • శ్రీశైలం లో నైట్ స్టే కోసం ఇచ్చిన non-AC హోటల్ వసతి  సర్వీస్ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అవుతుంది 
  • పిక్ అప్, డ్రాప్ ఆఫ్ మరియు సైట్ సీయింగ్ కోసం కేటాయించిన హైటెక్ మినీ ఏసీ బస్సు సర్వీస్ ఈ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అవుతుంది 

ధర

ఈ తెలంగాణ టూరిజం వారి హైదరాబాద్ టు  శ్రీశైలం ప్యాకేజ్ యొక్క టికెట్ ధర ఒక అడల్ట్ కు  రూ. 2390 మరియు ఒక చైల్డ్ టికెట్ ధర రూ. 1930. మా చైల్డ్ పాలసీ ప్రకారం పిల్లల వయస్సు 5 సం ల లోపు ఉంటే టికెట్ లేదు, 5 సం ల నుండి 12 సం వరకు టికెట్ ధర రూ. 1930 మరియు 12 సం లు పైబడిన పిల్లలకు అడల్ట్ ఫేర్ టికెట్ ధర వర్తిస్తుంది. 

ఎక్స్ క్లూషన్స్

  • దర్శన టిక్కెట్టు ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అవ్వదు 
  • ఎంట్రీ టిక్కెట్ ఇంక్లూడ్ అవ్వదు 
  • ఆహార పానీయాలు ఇంక్లూడ్ అవ్వవు 

గమనిక

  • సీట్ మార్పు కానీ సీట్ ప్రాధాన్యత కానీ అనుమతించబడవు
  • దర్శన టిక్కెట్టు మీరే స్వయంగా బుక్ చేసుకోవాలి 

కాంటాక్ట్ నెంబరు

9705441100 నెంబర్ కు కాల్ చేసి మా ప్యాకేజ్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు. 

మా వద్ద శ్రీశైలం టూర్ బస్సు  ప్యాకేజ్ లుమాత్రమే కాక కార్, ట్రైన్ మరియు ఫ్లైట్ ప్యాకేజ్ లు కూడా ఉన్నాయి.  ఈ టూర్ ప్యాకేజస్ హైదరాబాద్ నుంచే కాక జైపూర్ మరియు ముంబై నుంచి కూడా ఇక్కడ లభిస్తాయి. మా శ్రీశైలం టూర్ ప్యాకేజెస్ లో శ్రీశైలం తో పాటు హైదరాబాద్ సైట్ సీయింగ్ కలిపి చూపించే ప్యాకేజెస్ కూడా ఉన్నాయి.

Package Includes

Car
Sightseeing

Destinations & Places Covered

Srisailam
Mallikarjuna Swamy Temple | Pathala Ganga | Sakshi Ganapathi Temple | Shikaresvara Temple | Paladhara Panchadhara | Hatkeshwaram Temple | Sikharam
Need Help?