Home Manage Booking
Main Menu

Customer Care

Follow Us

Hyderabad To Tirupati Bus Package

Inlcudes To & Fro Transpotation, Darshan Ticket, Stay For Freshup

మేము (Bestbus) హైదరాబాద్ నుంచి తిరుమల తిరుపతికి బస్సు టూర్ ప్యాకేజీ ను అందిస్తున్నాం. ఈ ప్యాకేజీ లో  భాగంగా మేము తిరుమల ప్రత్యేక దర్శనం టిక్కెట్ ను కూడా ఇస్తాము. అంతే కాక వసతి సౌకర్యం కూడా ఈ ప్యాకేజ్ లో ఉంటుంది. తిరుమల దర్శనం అనేది భక్తులు అందరికి ఒక కల. దర్శన భాగ్యము కలిగిన వారిని అదృష్టవంతులు అని భావిస్తారు. అంతటి మహిమ ఉన్న పుణ్యక్షేత్రం మరి తిరుమల. ఆ మహిమకు తగ్గట్టు గానే అక్కడ రద్దీ కూడా ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి రద్దీ లో దర్శనం టిక్కెట్టు దొరకాలి అన్నా, తలనీలాలు సమర్పించిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి వసతి దొరకాలి అన్నా చాలా కష్టమని తలుస్తారు భక్తులు. ఇప్పుడు అలాంటి ఒత్తిడులు ఏమీ లేకుండా ప్రత్యేక దర్శనం టిక్కెట్ మరియు వసతి సర్వీస్ మా టూర్ ప్యాకేజీ ను బుక్ చేసుకుని ప్రయోజనం పొందండి. ఈ ప్యాకేజీ లో ఏసీ వోల్వో సీటర్ మరియు వోల్వో  స్లీపర్ బస్సు సర్వీసులు ఉన్నాయి. 

టూర్ షెడ్యూల్

 Day 1 షెడ్యూల్

  • బస్సు బోర్డింగ్ సాయంత్రం సుమారు 05:00 గంటలకు కే.ప్.హ్.బి లో మొదలై
  •  సుమారు 07:00 గంటలకు బషీర్బాగ్  లో పూర్తవుతుంది 
  • బోర్డింగ్ అవ్వగానే బస్సు తిరుమల కు బయలు దేరుతుంది. జర్నీ రాత్రి అంతా ఉంటుంది

Day 2 షెడ్యూల్

  • ఉదయం సుమారు 07:00 గంటలకు తిరుపతి చేరుకుంటారు 
  • తర్వాత హోటల్ లో చెక్ ఇన్ అయ్యి బాలాజీ దర్శనం కోసం తయారు అవుతారు 
  • ఫ్రెష్ అప్ అవ్వగానే రూమ్ ను ఖాళీ చేసి తిరుమల దర్శనానికి సుమారు 8:00 నుంచి 
  •    8:30  గంటలకు బయలుదేరుతారు. 
  • ముందుగా తిరుమల కొండకు non-AC బస్సు లో తీసుకెళ్తారు 
  • అక్కడ ఉన్న టికెట్ కౌంటర్ లో ప్రత్యేక దర్శనం టికెట్టు ను ఇస్తారు 
  • తర్వాత మీకు భోజనానికి సమయం ఇస్తారు           
  • భోజనం తర్వాత ఉన్న సమయాన్ని బట్టి తిరుచానూరు లో ఉన్న పద్మావతి అమ్మ 
  •  గుడికి  తీసుకెళ్తారు 
  • అక్కడ నుండి తిరుపతి లో ఒక హోటల్ కు ఫ్రెష్ అప్ కోసం తీసుకెళ్తారు 
  • ఫ్రెష్ అప్ అవ్వగానే తిరుపతి నుండి సాయంత్రం తిరుగు ప్రయాణం ఉంటుంది.

Day 3 షెడ్యూల్

  • ఉదయం సుమారు 7:30 నుంచి 8:00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు 

గమనిక : మా వద్ద వోల్వో స్లీపర్  మరియు వోల్వో ఏసీ సీటర్ బస్సు బుకింగ్  ఆప్షన్స్ ఉన్నాయి.  

ప్యాకేజీ ధర 

  • ఈ ప్యాకేజ్ లో వోల్వో  స్లీపర్ మరియు వోల్వో ఏసీ సీటర్ బస్సు బుకింగ్ ఫెసిలిటీ ఉంది. ఏసీ వోల్వో సీటర్  బస్సు కు ఒక అడల్ట్ టికెట్ ధర రూ. 3700 మరియు ఒక చైల్డ్ టికెట్ ధర రూ.2960.
  • అదే వోల్వో ఏసీ స్లీపర్ బస్సు కు పెద్దవారికి ఒక టికెట్ ధర రూ. 4,400 మరియు పిల్లలకు ఒక టికెట్ ధర రూ. 3520. 
  • ఈ చైల్డ్ టికెట్ ధర 5 నుండి 12 సంవత్సరాలు ఉన్న పిల్లలకు వర్తిస్తుంది. మా చైల్డ్ పాలసీ ప్రకారం 5 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అక్కర్లేదు, 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టికెట్ ధర అడల్ట్ టికెట్ తో సమానంగా ఉంటుంది.

ప్యాకేజీ లో ఉండేది

  • ఈ ప్యాకేజ్ లో హైదరాబాద్ నుండి తిరుపతి కి చేరుకోవడానికి మరియు తిరుపతి నుండి హైదరాబాద్ చేరుకోవడానికి అందించిన ఏసీ వోల్వో బస్సు చార్జీలు కూడా ప్యాకేజీ కాస్ట్  లో ఉంటాయి 
  • తిరుమల కొండ పైకి వెళ్ళడానికి వేసిన non-AC బస్సు ఛార్జ్ ప్యాకేజ్ కాస్ట్ లో  కలిపి ఉంటుంది 
  • 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ మరియు వసతి ప్యాకేజీ లో ఇంక్లూడ్స్ అవుతాయి

ప్యాకేజీ లో ఉండనివి

  • ఈ ప్యాకేజీ లో ఆహార పానీయాలు ఇంక్లూడ్  అవ్వవు. 

కాంటాక్ట్ నెంబరు

9811872515 కు కాల్ చేసి ప్యాకేజ్ కు సంబంధించిన మీ సందేహాలను క్లియర్ చేసుకోవచ్చు.

ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుని మహిమ గల తిరుమల క్షేత్రాన్ని దర్శించుకోండి. మా వద్ద తిరుమల ప్యాకేజీ బస్సు లోనే కాక ట్రైన్ మరియు ఫ్లైట్ ప్యాకేజ్ లు కూడా ఉన్నాయి. ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుంచే కాక చెన్నై, బెంగళూరు, సేలం, ముంబై, రాజమండ్రి, విశాఖపట్నం, పూణే వంటి 43 పట్టణాలు నుండి కూడా ఉన్నాయి. మా ఈ హైదరాబాద్ నుంచి తిరుమల బస్సు ప్యాకేజీ ను బుక్ చేసుకుని తిరుమల బాలాజీని  దర్శించుకుని ఆనందించండి.